పుట:Nanakucharitra021651mbp.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హేతువు సంసారము దు:ఖహేతువని పెద్దలు చెప్పెడుమాటలు వానికి జ్ఞప్తికిరాగా నతడు మాటిమాటికి మెడకు గుదికఱ్ఱయుగలిగి సంకిలియునగు నీవివాహమేల చేసికొంటినని విచారించుచు దృడమైన యాబంధమును తెంపుటకు సమయమును నిరీక్షించుచుండెను. అట్లు నిరీక్షించుచుండగానే యనేక సంవత్సరములు గడచెను. అతనికప్పటి ముప్పదియాఱవయేడు. వివాహమై పదునాఱు సంవత్సరములాయెను. అతనికిద్దఱు కుమారులు జన్మించిరి. అతని ముప్పది రెండవయేట మొదటి కుమారుడు పుట్టెను. ఆకుమారునిపేరు శ్రీచంద్రుడు. మఱి నాలుగేండ్లకనగా ముప్పది యాఱవయేట రెండవకుమారుడుదయించెను. అతనిపేరు లక్ష్మీదాసు. అట్టియవస్థలలో నానకు జీవితమందు గొప్ప మార్పొకటిజరిగెను. ఆమార్పు వానిని సంపూర్ణముగ మార్చివేసెను. భార్యాబంధమే త్యజింప నలవిగానిది. అట్టియెడ సంతానముచేత మఱింత దృడమైన యాబంధమును నానకు తృణప్రాయముగ ఛేదింపగలడని లోకులెవ్వఱు దలంపలేదు. వానిశత్రులు మిత్రులుగూడ నానకు సంసారబంధనం దగులుకొన్నాడు. వాని బ్రహ్మవిద్యయంతయు నడుగంటినదని బహిరంగముగ ననుకొనుచుండిరి. అట్టి సమయమున నానకు సర్వసంగ పరిత్యాగియై యెల్లవారల నద్భుత మొందజేసెను. రెండవ కుమారుడు పుట్టినయాఱు మాసములకు నానకొక నాడొకచోట నొంటిగ గూర్చుండి దీ