పుట:Nanakucharitra021651mbp.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్నడు బుద్ధితెచ్చుకొని బాగుపడుదువు నాయనా" యని యల్లునిమీదబడి రక్కసులవలె వానిని బాధించుచు వచ్చిరి. సహజముగ శాంతశీలుడయి వాక్పారుష్యమన్న మిక్కిలి యసహ్యపడుచు నిరంతరము మనశ్శాంతినే గోరు నానకు, ఆలిపోరునకు దోడుగ నత్తమామల పోరుగూడ సంభవించుటచే మనస్థిమితము లేనివాడయి చాల దు:ఖపడుచు వచ్చెను. ఒకప్పుడత్తమామల పోరుబడలేక మాయింట నన్నవస్త్రములకు లోపము లేదుకదాయని యడుగుచుండును. ఆపలుకుల కత్తమామలు మిక్కిలి కినిసి "అన్న వస్త్రములున్న చాలునా మఱేమియు నక్కఱలేదా! నగలుండవలె నాణెములుండవలె సంసారము చేయుచున్నపుడెన్నో యుండవలెను. కాలు నొచ్చిన చేయినొచ్చిన నింటగూర్చుని సుఖముగ తినుటకు గొంతసొమ్ము నిలువ యుండనక్కరలేదా! నీసొమ్ము దినుచున్న గోసాయిలు సన్యాసులు నీకాపత్సమయమున నక్కఱకువత్తురని తలంచుచున్నాడవు కాబోలు. పాపమేమియు నెఱుగని మాపిల్ల యట్టియాపత్సమయము వచ్చినచో నిష్కారణముగ గంగలో దిగవలయు" నని నిష్ఠురముగ బలుకుచు వచ్చిరి. కర్ణకఠోరములగు నప్పలుకులు వినినప్పుడు నానకు మనస్సు మిక్కిలి ఖేదమునొంది "మాయూరికి మాయత్తవారియూరికి నిప్పుడున్నదూరముకంటె బదిరెట్లుదూరముండిన బాగుండునుగదా దూరముండినపక్షమున వీరు తఱుచుగవచ్చి నన్ను బాధింప