పుట:Nanakucharitra021651mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తటస్థించునేని బిడ్డలొకవేళ సుగుణవంతులు కావచ్చును. భార్యాభర్తలిద్దఱు దుస్స్వభావులయినపుడు బిడ్డలు సాధుశీలురగుట యరిది. అయోగ్యులగు జననీజనకుల కుద్భవించినను బిడ్డలు జన్మించినది మొదలు సజ్జనులచే బెంపబడుదురేని వారికి సద్గుణము లలవడవచ్చును. అట్లుగాక యవివేకులగు మాతాపితలకు బుట్టి వారికడనేపెరిగిన బిడ్డలమాట వేరే చెప్పవలయునా! చూనీదేవి గయ్యాళితనమున దల్లిదండ్రులను బోలినందున బ్రతిదినము మగడు గృహమునకు వచ్చినప్పుడు పిల్లిమీదబెట్టి యెలుకమీదబెట్టి సణుగుచు నిదిలేదదిలేదని కేకలు వేయుచుండును. అంతతో బోక గృహకృత్యములకు గావలసిన సంబారములు సరిగ సమకూర్చుట లేదనియు సంపాదించిన ధనమంతయు బైరాగులకు బావాజీలకు బెట్టి సంసారము గుల్ల చేయుచున్నవాడనియు, నుదయాస్తమయములు మగనిని సాదించు చుండును. సంపాదించిన ధనములో జిల్లిగవ్వయైన వెచ్చబెట్టక తనయిచ్చవచ్చినట్లు వ్యయముచేయుటకు దనయధీనము జేయుమని పోరుచుండును. తానెంత పోరువెట్టినను భర్త తనమాట రవ్వంతయు లక్ష్యము సేయనందున నామెతనపంతము నెగ్గించుకొనుటకు బలుమారు తల్లిదండ్రులకు దనకష్టములదీర్ప రమ్మనివర్తమాన మంపుచుండెను. పంపుటయేతడవుగ వానియత్తమామలిరువురు కూతురుమిక్కిలి కష్టపడుచున్నదనుకొని యల్లుని యింటికివచ్చి తమకూతు రష్టకష్టములు బడుచున్నదని కల్లిబొల్ల యేడ్పులేడ్చి "యె