పుట:Nanakucharitra021651mbp.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

నానకు చరిత్ర.

చతుర్థాథ్యాయము.

ఇరువది యేండ్లయిన నిండకముందే నానకు గృహస్థుడయి సంసారభారము వహించెను. కాని యాపెండ్లి వానిజీవనము సుఖాస్పదముగ జేయుటకు మారు దు:ఖభాజనముగ జేసెను. చూనీదేవి కోపశీల గర్వసమేత. ఒరులపై నధికారముచేయనిచ్చకలది. ఆమె జనకుండగు మూలుడు కాలుని యచ్చు. వాక్పారుష్యమునందు ధనాశయందు మన:కాఠిన్యము నందు వియ్యంకు లొండొరులకు దీసిపోరు. చూనీదేవితల్లి నానకు తల్లివంటిదిగాక భర్తగుణములకు వన్నె వెట్టుచు ననుకూల దాంపత్యమని లోకులు చెప్పుకొనునట్లు నడచెను.

అట్టి జననీ జనకుల కుద్భవించినందున చూనీదేవి తల్లిచాలు బిడ్డయు తండ్రిచాలు బిడ్డయు నయ్యెను. తల్లిదండ్రుల గుణములు ప్రతిబింబములట్లు బిడ్డలయందు గానబడుచుండును గదా. తల్లి మంచిదికానపుడు తండ్రి మంచివాడగుటయో తండ్రి యోగ్యుడు గానపుడు తల్లి యోగ్యురాలగుటయో