పుట:Nanakucharitra021651mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకనాడు సాయంకాలము జయరాముడు భార్యయు నానకునుగూర్చి మాటలాడుకొను చుండునంతలో నతడేవచ్చివ్యాపారములో తనవంతువచ్చిన లాభపుసొమ్ము దెచ్చి దాచుడని వారిచేతికిచ్చెను. అక్కడకు దమ్మునిమీదననుమానమెన్నడును లేకపోయినను లోకులుచేసిన నిరాపనిందల కామెమన:ఖేదమునొంది పరీక్షానంతరమున నిష్కళంకుడైవచ్చినసోదరుని బహువిధముల గారవించెను.

నానకు గుణవంతుడై ధనసంపాదకు డగుటచేత స్వకుటుంబభారము వహింపగలడు గావున వానికి వివాహము శీఘ్రముగ జేయుట యుచితమని సోదరీ భావుకలు తొందర పడిరి. అదియునుగాక సంసార బంధమునందు వానిని బ్రవేశపెట్టినచో నతడందే తవుల్కొని యన్యవిషయమునుండి మనస్సు మరల్చి బాగుపడునని వారెంచి యీవఱకే వానికొక సంబంధము కుదిర్చిరని మనమెఱుగుదుముగదా. జయరాముడు నానకునకు బిల్ల నీయదలచిన మూళునిపేర ముహూర్త నిశ్చయము చేయుమని జాబులువ్రాసెనుగాని మూలుడు వివాహమునకు గావలసిన సంబారములు తనకు సమకూడలేదని కొంతయాలస్యము జేసి యెట్టకేలకు భాద్రపద బహుళ సప్తమిదినమున సుముహూర్తము నిశ్చయించి వివాహమునకుం దరలి రమ్మని వ్రాసెను. కాలుడు సకుటుంబ పరివారముగా సుల్తానుపురమునకు బోయి యటనుండి పెండ్లికొడు