పుట:Nanakucharitra021651mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కును జయరాముడు మొదలగు చుట్టములను దోడుకొని తరలిపోయెను. వియ్యంకుడు వియ్యాలవారిని దనస్థితికి దగినట్లు గౌరవించెను. వివాహ మహోత్సవము మూడుదినములు జరిగెను. నాలవనాడు కాలుడు పెండ్లికూతురును వెంటబెట్టుకొని సపరివారముగ బయలుదేరి సుఖముగ సుల్తానుపురము జేరెను.

పెండ్లికూతురుపేరు సల్లఖి. అత్తవారెందుచేతనొ తల్లి దండ్రులు పెట్టిన పేరంబిలువక చూనియని యామెను బిలుచుచువచ్చిరి. సుల్తానుపురమునకు వచ్చినపిదప కాలుడు కొడుకునుం గోడలిని స్వగ్రామమునకు దోడ్కొనిపోవదలచెను. తాల్వెండిగ్రామమునకు బోవుటకునానకున కిష్టము లేదు. ఆకారణముచేత జయరాముడు నానకియు దాని కంగీకరింపరైరి. కాని కొందఱు పెద్దలు నానకుయొక్క తల్లి వివాహమునకుం రానందున కొడుకుంగోడలు కాపురము చేయుచుండ నామెకన్నులు చల్లగ చూడగోరుననియు నొక్కనెలయైన నామెకడనుండుట యుచితమనియు నుపదేశించిరి. ఆయుపదేశముంబట్టియు దల్లిమీదగల గౌరవముంబట్టియు నానకు స్వగ్రామమునకు బోవ నిష్టపడి భార్యాసమేతుడై తండ్రితో గూడ జనియెను. అతడు వచ్చువఱకు నంగడిపని బలుడు చూచుట కొప్పుకొనెను. వివాహ దీక్షితుడై కళ్యాణవేషముతోనున్న కుమారుడు ధర్మపత్నీసమేతుడై తల్లిపాదములకు నమస్కరింప, త్రిప్తాదేవి