పుట:Nanakucharitra021651mbp.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లుజోడించి నానకు గొప్పవారి దరిశనము లెన్నడు చేయని పల్లెటూరు వాడగుటచేత మర్యాదలు తెలియక యట్లు వచించెనేకాని యనుమానింప దలచుకొనలేదనియు దనయం దేదోషమును లేదని నమ్మి యంతవిస్పష్టముగా బలుక సాహసించెననియు బ్రధమ దోషమగుటచే క్షమియింపదగు" ననియు బలుతెఱంగుల ప్రార్థించెను.

ఆవేడికోలు విని దయాళునయి నవాబు తనకోటలో నున్న యదురావను మంచి లెక్కగానిని పిలిపించి యంగడి లెక్కలు శోధింపుమని యానతిచ్చెను. యదురావు మిక్కిలి జాగరూకతతో నైదుదినములు లెక్కలు పరీక్షించెను. నవాబుపెట్టిన పెట్టుబడియు దానిమీదవానికి రావలసిన లాభమునుగాక 321 రూపాయలు కొట్టులో నిలవయున్నట్టు లీపరీక్ష వలన దేలెను. నానకు తననిమిత్తము దానధర్మముల నిమిత్తము వ్యయముచేయగా నతనివంతు మిగిలినసొమ్మిది. అదిచూచి జయరాముడు మానప్రాణములు దక్కినవని మిక్కిలి సంతోషించి మరునాడు నవాబు దరిశనమునకు బోయెను. అదివఱకే యదురావువలన లెక్కల పరీక్షనుగూర్చి నవాబు వినియున్నందున జయరామునిజూచి యతడు "నీమరదిమీద నీవిధముగా వాడుకలు కలుగుటకు కారణమే"మని యడిగెను. అనవుడు జయరాముడిట్లనియె. "లోకములో నెంతమంచి వారికయినను శత్రువులుండక మానరుకదా. అట్లే మానాన