పుట:Nanakucharitra021651mbp.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వనుబిలిచి మునుపటియట్లె తనలెక్కల బరీక్షింపుమని కోరెను. జయరాముడు తనమనస్సులో ననుమానముగా నున్నట్లు నానకునకు దెలియుట కిష్టములేని వాడయి యంగడిలో నేదోలోపమున్నదని మాత్రము మనస్సులో నభిప్రాయపడి లెక్కలు పరీక్షించుమని కోరినమాత్రముననే యందుకీయకొని నానకును నవాబువద్దకు తీసుకొనిపోయి యాతని దరిశనముచేసి లెక్కలు పరీక్షింపుమని కోరెను. నవాబు వానిమాటలువిని నానకును తనయెదుటికి పిలిచి పేరేమనియడిగి పేరు తెలిసికొన్నపిదప జయరామునివంక తిరిగి వీనికి వివాహమయినదాయని యడిగెను. వివాహము కాలేదని జయరాముడు ప్రత్యుత్తరము జెప్ప విని నవాబు "అదిగో అదేకారణము వివాహము కాకపోవుటచేతనే యతడు మాసొమ్మిట్లు పాడుచేయుచున్నాడు. నీవు నాస్వభావ మెఱుగుదువుగదా. లెక్కలు సరిగా నుండనిపక్షమున మీగతి యేమగునో చూచుకొనం" డని కఠినోక్తులు పలికెను. నానకు వానికఠోరభాషణము లాలకించి యించుకేని వెఱపునొందక "లెక్కలు చూపినపిదప మీయిష్టము వచ్చినట్లు చేయవచ్చును లెం"డని నిలన్‌క్ష్యముగ బదులుచెప్పెను. తనయంతవాని యెదుట నానకు నిర్భయముగా నిలన్‌క్ష్యముగా నిశ్చలముగా నట్లు ప్రత్యుత్తరము చెప్పుటచేత నవాబునకు మితిమీరిన కోపమువచ్చెను. ఆకోపముపైకి స్ఫుటముగాక ముందే జయరాముడు వానిముఖలక్షణములు గనిపెట్టి మిక్కిలి వినయముగా చేతు