పుట:Nanakucharitra021651mbp.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడిరి. ఏలయన నానకునకు వాని శిష్యుడగు బలునకు గావలసినభోజనపదార్ధముల నిమిత్తమగు వ్యయము మిక్కిలి స్వల్పము. నానకువేదాంతియగుటచే గేవల ముదరపోషణమే ప్రధాన కార్యముగ జేసికొనక యేదితినినను దినము వెళ్ళిపోవునని సామాన్యులు భక్షించు వస్తువులనే యుపయోగించుచు వచ్చెను. గంజి యన్నమెంతో వానికి బంచభక్ష్యపర మాన్నములు నంతె. మధురాహారములు గ్రహించి తన పొట్టనింపి కండలు పెంచుటకంటె సొమ్ముమితముగా వాడుకొని మిగిలినసొమ్ము సద్వినియోగముం జేయుట యిహపర సాధనమని యతండు నమ్మి జాగ్రతతో నుండెను. అట్టి మహానుభావులు తిండిపోతులుగా నుండరుగదా. అతడు చేయు దానములు మెరమెచ్చుల దానములుగాక యపాత్రదానములుగాక పేదలకు భగవగ్భక్తులకు నీయబడిన సత్పాత్ర దానము లయ్యెను. గ్రామవాసులలో ననేకులు నానకుచేయు వ్యయములగూర్చి యత్యద్భుతముగా జెప్పుకొనుచుండుట విని జయరాముడు లోకులమాటలే నిశ్చయములైనపక్షమున నవాబు నానకును దండించుటయే గాక తనకుగూడ మహాపకారముచేయునని భయపడి మరది నడుగుట కిష్టములేక సందేహించుచుండెను. నానకును లోకుల గోలవిని బావమనస్సు సంశయాకలితమైనదని తెలిసికొని తనచరిత్రము నిర్దుష్టమని వెల్లడిచేయుటకును, నిందారోపకులకు బుద్దిచెప్పుటకును, బా