పుట:Nanakucharitra021651mbp.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

నానకు చరిత్ర.

తృతీయాధ్యాయము.

నానకునకు నానాటికి వ్యవహారములో లాభమధికముగ వచ్చెను వచ్చిన లాభమంతయు నతడు మునుపటికకంటె నెక్కుడుగ దైవభక్తులకు దీనులకు దానము చేయదొడగెను. అందుచేత గ్రామములోని జనులందఱు వానివతన్‌నముంగూర్చి తమలో దారు చెప్పుకొన నారంభించిరి. కొందఱతని యౌదార్యమును మెచ్చుకొనిరి. మఱికొందఱతని వితరణమునకు విపరీతార్ధములను గల్పించి నిందింపసాగిరి. లోకులు పరమార్ధము నరయక వినినదంతయు నమ్మువారగుటచే నానకు యజమానుని ధనమంతయు యధేచ్ఛముగ వమ్ముసేయున్నాడని యభిప్రాయపడిరి. యజమానుని ధనమే యిచ్చవచ్చినట్లు వ్యయము సేయక పోయిన పక్షమున నిద్దఱు మనుష్యులకు గావలసిన కర్చులే గాక సన్యాసులకు బిచ్చగాండ్రకు దోచి పెట్టుటకు వీని కెక్కడినుండిసొమ్మువచ్చినదని లోకులు పలుక జొచ్చిరి. ఆవిషయమున లోకులు నిశ్చయముగా దురభిప్రాయ