పుట:Nanakucharitra021651mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాని పోవలయునని తలంచెను. కానీ సోదరీభావుకలు చాల బలవంతము చేయుటచేతను వారి మాట గౌరవింపవలయునని బలుడు ప్రార్థించుటచేతను నిలువవలసి వచ్చెను. దౌలతుఖాను వాని సత్యసంధతకు మెచ్చి పెట్టుబడినిమిత్తము రెండువేల రూపాయల నిచ్చెను. కొట్టు క్రమక్రమముగ వృద్ధిపొందెను. నెలనెలకు రాబడి హెచ్చెను. ఈవృద్ధికి నానకుమిక్కిలి సంతోషింప జొచ్చెను. కాని యాసంతోషము ధనలాభము వచ్చుచున్నదని కాదు. మరేమనిన సత్పురుషులకు సాధువులకు సన్యాసులకు దీనులకు దైవభక్తులకు సహాయముచేసి తన జన్మముసఫలము చేసికొనవచ్చునని యత డాయుద్యోగమునం దంతకాలముండెను. నానకుయొక్క యాత్మజలమందుండియు జలసంపర్కము లేని తామరపూవువంటిది గదా!