పుట:Nanakucharitra021651mbp.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గున భీతిల్లక తన తమ్ముడు లోకవ్యవహారము మెఱుగనివాడు కాడనియు నత డెంతధర్మాత్ముడైనను నీతిసంపన్ను డగుటచే నితరుల ధనము చేతికివచ్చినట్లు వమ్ముచేయడనియు దృడముగ జెప్పి వానివెరపు తీర్చుటకు దమ్ముని బిలువనంపి క్షేమమడిగి యిష్టాగోష్టి కొంతసేపు నడపెను. అదియే మంచిసమయమని జయరాముడు వినయముతోడను శాంతముతోడను మరదిం బలుకరించి యంగడి వ్యవహార మేరీతిం జరుగుచున్నది లాభనష్టము లెట్లున్నవని యడిగెను. నానకు బావనోటనుండి యప్పలుకులు వెడలినతోడనే కంఠస్వరమునుబట్టియు ముఖలక్షణమునుబట్టియు వానికి దనమీద నేదో యనుమానము కలిగినదని గ్రహించి తన్నొక రనుమానించుట కిష్టపడక తన నిరుపరాధత్వమును వెల్లడిచేసికొనదలచి తక్షణము లెక్కలు పరిక్షచేయుమని బావను కోరెను. నానకియు వాని మాటనే యనుసరించుటచే జయరాముడు వాని లెక్కలు శోధించెను. ఏమి చెప్పుదును లెక్కలుచూడగా పెట్టుబడిసొమ్ము దౌలతుఖానుగారి లాభము నిలువయుండుటయేగాక నానకునకు మూడువందల యిరువది రూపాయలు రావలసియుండెను. అది చూచి యక్కయు బావయు మిక్కిలి యానందము నొందిరి. కాని తన మరియాదయు దన న్యాయబుద్ధియు బాటింపక నిష్కారణముగ వారు తనమీదననుమానము నొందినందుకు నానకు మిక్కిలి నొచ్చుకొని మన:ఖేదమునొంది వ్యాపారము