పుట:Nanakucharitra021651mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ళకువచ్చి వ్యాపారముచేసి వేళ కింటికి బోవుచున్నా డదియే చాలునని సంతోషించెను.

నానకీ జయరాములు నానకునకు వివాహము జేయ గృతనిశ్చయులైన ట్లిదివఱకే చెప్పియున్నారముకదా? జయరాముం డాసంకల్పము నెరవేరువఱకు సరిగ గుడవక నిద్రింపక చుట్టుప్రక్కల గ్రామములకు దడిమన్ను పొడిమన్నగు నట్లు దిరిగి ప్రయత్నించెను. అట్లు ప్రయత్నించుచుండ నొక గ్రామమున మూళుడను నొక క్షత్రియునివద్ద సంప్రాప్త యవ్వనయై వివాహయోగ్యయగు కన్య యొకతె యున్నదని వానికిం దెలిసెను. అల్లుడామాట మామకు నెఱిగింప కాళుడు మూళునితో వియ్యమందుట కియ్యకొని ప్రధానము చేసికొని రమ్మని జయరామునితో జెప్పెను. ప్రధానము యధావిధిగా జరిగెను. వివాహ ముహూతన్‌ము నిశ్చయింప బడెను. కాళుడు పెండ్లిపనులను జేయింప స్వగ్రామమునకు బోయెను. ప్రధానమైన యొక మాసమునకు జయరాముని వద్దకు కొందఱుపోయి నానకుధాన్యపుకొట్టు సంబంధమగు లాభమును మూలధనమును సాధువులకు సన్యాసులకు నిచ్చవచ్చినట్లు దోచిపెట్టి పాడుచేయుచున్నాడనియు దానివలన బావమరదుల కిద్దరకు నపాయము వాటిల్లుననియు జెప్పిరి. ఆమాటలు విని జయరాముడు తన ప్రాణముమీదికి వచ్చునని భయపడి కర్తవ్యమేమని భార్యనడుగ నామెమగని తెఱ