పుట:Nanakucharitra021651mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు జిరినవ్వు నవ్వి యిట్లనియె. "ఓయీ! మోసపోకుము. నే నెట్లు కాదలచినవాడనో యట్లయితీరుదును దానికి నాకు నడుమ నేదియు నడ్డము రాజాలదు. ప్రస్తుతము కాలక్షేపము నిమిత్తము కొన్నినాళ్లీపని జేయబూనితినేకాని యిదినా పరమార్థము కాదు. సమయము వచ్చినప్పుడు మనమిద్దఱము గలిసియే పోవుదుము. గావున నీవు నావద్దనేయుండుము." అప్పలుకులు వినినతోడనే బలుని సందియములు తొలంగెను. తొలంగకపోయినను నానకుమీద వానికి మిక్కుటమగు ప్రేమ యుండుటచేత నతని కోరికప్రకారము వాడచ్చట నుండవలసినవాడే.

నానకు వ్యాపారము రెండునెలలు చేయునప్పటికి గుమారు నొక్కసారి యుద్యోగము చేయుచుండ జూడవలయునని యుబలాటపడి కాళుడు స్వగ్రామమున ముండ్లమీద నుండినట్లుండి యేమియుం దోచక సుల్తానుపురమునకు బోయెను. పోయి కొట్టుమీద కుదురుగా గూర్చుండి వ్యాపారము చేయుచున్న కొడుకుంజూచి పట్టజాలని సంతోష మొంది వ్యవహారమెట్లు జరుపుచున్నాడో తెలియగోరి కొడుకువ్రాసినలెక్కలు పరీక్షించెను. పరీక్షింపగా వచ్చినలాభములో నొక గవ్వయైన నిలువయున్నట్లు వానికి గనబడలేదు. అయినను కాళుడు కొడుకు నేమియుననక కాలక్రమమున నవియు జక్కబడునని తలంచి ప్రస్తుతము కొడుకు కొట్టుమీదకు వే