పుట:Nanakucharitra021651mbp.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున మనమా నిమిత్తము నీవీ పనిలో బ్రవేశింప నక్కరలే" దని స్పష్టముగ జెప్పెను. ఎంత చెప్పినను నానకు తన యుద్యమమును విడువనందున నానకి వాని యుద్యమమున కొప్పుకొనియె పిమ్మట సతీపతులిరువురు జేరి గుదికఱ్ఱవంటి సంసారబంధమును నానకు మెడకు తగిలించినచో నతడత్యాసక్తుడుగాక యుండునని వాని కచిరకాలమున వివాహముచేయ నిశ్చయించిరి. కొడుకుద్యోగములో జేసినవాతన్ కాలుడు విని వణన్‌నాతీతమైన యానందము నొంది కొడుకింక బాగుపడి తీరుననియు ముందెంతవాడో యగుననియు నూటలూర జొచ్చెను.

నానకు విక్రమార్క శకము 1544 వ సం.రం మాఖ శుద్ధాష్టమినాడు సుల్తాను పురముజేరి కొన్ని దినములలోనే యుద్యోగమున బ్రవేశించెను. దౌలతుఖానులోడీ క్రొత్త గుమస్తాచేతికి ధాన్యపు కొట్టు స్థాపించునిమిత్తము మొదట వేయి రూపాయలిచ్చెను. నానకుయొక్క పూర్వచరిత్ర మెఱిగినవారు వాని స్వభావమున కంత విరుద్ధమైనపనిలో నెట్లు ప్రవేశింపగలిగెనో యని యచ్చెరువడ జొచ్చిరి. మాయామర్మము లెఱుగని బలుడును నానకు లౌకిక వ్యవహారము లందు బ్రవేశించుచున్నవాడు గావున తన సాయ మంతటి నుండి యక్కరలేదనుకొని స్వగ్రామమునకు బోవుటకు దనకు సెలవిమ్మని నానకునడిగెను. నానకు వాని వెంగలితనము