పుట:Nanakucharitra021651mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లో బ్రవేశించుట విజయరామున కంతగానిష్టము లేకపోయినను దోబుట్టువు సొమ్ముతినుట నానకున కిష్టములేదని గ్రహించి యట్టియాత్మగౌరవముండుట మంచిదే యని భావించుటచేతను నానకున కెదురాడుట కిష్టము లేపోవుట చేతను మరది యిట్టిప్రకారము పోవదలచి యతడు పనికొఱకు బ్రయత్నించెను. అప్పుడే దౌలతఖానులోడీ పెట్టించిన ధాన్యపుగొట్టుమీద గుమస్తా కావలసివచ్చెను.

ఆపనిలో బ్రవేశించుటకు నానకు సమ్మతించెను. అంతకు మునుపు నానకు మందకొడిగ గూర్చుండి యెవ్వరితో మాటలాడక నెల్లప్పుడు పరధ్యానముగ నుండుచువచ్చినందున నుద్యోగములో బ్రవేశించిన తోడనే కొంతమాంద్యము వదలుననియు కొడుకు వ్యాపారములో బ్రవేశించినాడని విని కాలుడు పరమానంద మొంది తనయెడం గృతజ్ఞుడగుననియు దలంచి జయరాముండు మరది సంకల్పమును గొనియాడి యవాతన్ భార్యకెఱిగించెను. నానకి తమ్ముని వాతన్ పతి ముఖమునవిని బాలు డంత యాకస్మికముగ నెట్లుమారిపోవునని విచారించి సోదరీగృహమునుండి కాలము బుచ్చుట కిష్టములేక సోదరుడట్లు తలంచెనేగాని స్థిరబుద్ధిగలిగి యామాటకు నిలువంబడి యుండడని భర్తతో జెప్పి యంతట నిలువక తమ్మునిం బిలిచి "మాకు నీవుభారమగా నుండవు మాకు గావలసిన పదార్థము లన్నియు నున్నవి గా