పుట:Nanakucharitra021651mbp.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలుడును కాపుకుఱ్ఱవాడు మొదటినుండియు నానకు బరమభక్తుడు అందుచేత వాడయాచితముగ దలితండ్రులను గృహమును విడిచి నానకు వెంటబోయెను. పోయి యొక్కనాడైన సుఖింపక గురువుతో గలిసి యెన్నో యిడుమలబడెను.

ఇల్లువిడిచి యైదుదినములు పయనముచేసి నానకు సుల్తానుపురము చేరెను. అక్కయు బావయు వానిని కడుబరమానందమునొంది మిక్కిలి గౌరవించి జయరాముడు మరది జూచి నీవునీయిచ్చవచ్చినట్లు భగవథ్యానముచేసికొనుచు గూర్చుండ వచ్చు, నీజోలికెవ్వరు రారని స్పష్టముగ జెప్పెను. అంతటి యాదరము జూపినందుకు నానకు తనయప్ప బావలకు గృతజ్ఞుడై వందనములుచేసి చిరకాలము మీకు వేను భారముగానుండ"నని తనయాత్మగౌరవము వెల్లడియగునట్లు బలికెను. తనయునికి బావకు భారముగానుండునని తలంచి నానకావిధముగా బలుక లేదు. చెడిచెల్లిలింటికి బోవుటకన్న స్నేహితునియింటికి బోవుట మంచిదను సామెతను బట్టిపాటు పడక సోమరియై యక్కసొమ్ముందని యాత్మగౌరవముం జంపుకొనుట యనార్యకృత్యమని యెఱింగి యాతడిట్లు పలికెను. ఆయూరు జేరినదిమొదలు నాన కేదో యుద్యోగము సంపాదించుకొని సొంతపాటువలన బొట్టపోసుకొని తన సేవకుడగు బలుని బోషింపవలయునని నిశ్చయించుకొనెను నానకు పని