పుట:Nanakucharitra021651mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోయెను. పిమ్మట కొన్ని మాసములుగడువ నొకనా డుదయమున స్నానముచేసి చెంబుచేతపట్టుకొని యింటికిబోవుచుండ దారిలో నొకసాధువు కనబడెను. కనబడినతోడనే యతడు వానికడకుబోయి చాలసేపు వానితో వేదాంతచర్చచేసి చెంబును వ్రేలనున్న యుంగరమును వానికిచ్చి గృహమునకుబోయెను. కాళుడు వానినిజూడగానే యావస్తువు లేవియని యడిగెను. నానకు వానిమాటలు కేయుత్తరమును జెప్పక తలవంచి నిలిచియుండెను. అప్పుడు కాళుడు దుర్భర కోపావేశమున వానిం బలుతెఱంగులదిట్టి యిట్లనియె. "నీవు నాకెందుకు బనికిరావు. నాగృహము తక్షణము విడిచి నీయిచ్చవచ్చినకడకుబోయి యన్నము సంపాదించుకొని బ్రతుకుము నేను నీవిషయమున నన్నియాసలు విడుచుకొన్నాను."

అహహా! కాళుడు బిత్తలుకతో నేబాలుని బరమ మూర్ఖునిగా భావించి నిందించెనో, యాబాలుని లోకులు సర్వజ్ఞునిగ భావింతురని యించుకేనియు నెఱుంగడుకదా! అతడెవ్వని తనగృహమం దుండనీయక వెడలనడపెనో యాబాలుని ముందుముందు రాజాధిరాజులు సింహాసనంబులు దిగివచ్చి ప్రణతులై నిజాంత:పురమునకు రమ్మని ప్రార్థింతురనిస్వప్నమందైన నెఱుగడుకదా! అట్లెఱుగక యింటనుండి కాళుడు కొడుకునుదోలుటయే లోకమునకు మేలయ్యె; రాయబులారు నానకును దండ్రి యింటనుండి లేచిపొమ్మనవిని కా