పుట:Nanakucharitra021651mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దౌలతుఖాను లోడీపనుపున పంటల యంచనా వేసికొనుటకు తాల్వెండీ గ్రామమునకుంబోయెను. అతని కప్పటికి వివాహముకాలేదు. ఆరాజకుమారు డొక్కనాడు కాలుని కుమాతెన్‌యగు నానకినిజూచి యామె చక్కదనము నచ్చుటయు నాకన్నియను దనకిమ్మని తండ్రినడిగెను. అతనికోరిక కనుగుణముగ రాయబులారుగూడ జయరాముని సద్గుణముల నుగ్గడింప గాలుడు సంబంధ మంగీకరించి ముందుగప్రధానముచేసి యల్పకాలములోనే కూతును జయరామునకిచ్చి వివాహముచేసెను. వివాహానంతరమున బెండ్లికూతురు పెండ్లికుమారునితో గృహప్రవేశమునకు బోన గాలుడు నానకును వానివెంట సుల్తానుపురమునకంపెను. నానకుతండ్రిమాట జవదాటక నచ్చటికి తిన్నగాబోయి చెలియలను మరల దోడ్కొనివచ్చెను. మరుసటిసంవత్సరము వైశాఖమాసమున జయరాము డత్తవారి యింటికి రాగా రాయబులారు వానిం బిలిచి నానకునుకు బొత్తిగా సుఖములేదనియు దండ్రి మిక్కిలి కఠినుడగుటచేత స్వగృహమున నున్నంతకాలము కష్టమే ప్రాపించుననియు దోబుట్టువు దగ్గరనున్న పక్షమున నతనికి సుఖము కలుగుననియు జెప్పెను. జయరాముడందుకు సమ్మతించి వానిని వెంటగొనిపోవుదునని ప్రత్యుత్తరమీయ రాయబులారు "తొందరపడవద్దు ఇదిసమయముగాదు. సమయమువచ్చినప్పుడు నేనే పంపెద" నని యప్పటికి నివారించెను. అనంతరము జయరాముడు భార్యాసమేతుడై స్వగ్రామమునకు