పుట:Nanakucharitra021651mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విచారముగా నున్నదనియు వానింబాధపెట్టవద్దని తానొకసారి వెనుక కోరినను దనమాటయైన లక్ష్యముసేయకపోవుట యనుచితమనియు గలిగిననష్టము దానిచ్చుకొన గోరుచున్నవాడనియు జెప్పి యిరువది రూకలు దెచ్చి కాలునిచేతిలో బెట్టెను. కాలుడు మిక్కిలి సిగ్గుపడి తనకాసొమ్మక్కరలేదని చాలసేపు నిరాకరించెను కాని వానిప్రార్థనమీద నెట్టకేలకు స్వీకరించెను. కుమారుడు పాడుచేసినసొమ్ము కాలుడు రాయబులారువద్ద పుచ్చుకొన్నాడనివిని లోకులు కాకులు పొడిచినట్టు పొడిచి యాత్మగౌరవము జంపుకొని ధనమే పావనముగా నెంచుకొన్నందుకు వానిని మిక్కిలి నిందించిరి. ఆనిందలుపడలేక కాలుడు సొమ్ముతీసికొనిపోయి మరల రాయబులారునకీయబోవ నతడు పుచ్చుకొనక వానివద్దనే యుంచుమని బ్రతిమాలి వెండియు నిట్లనియె "నీకుమారుడు నీయింట బొత్తుగా సుఖపడుట లేదు. వానిని వేరొకచోట బసచేయింప వలయునని నేదలంచుచున్నాను. నేనుతురక నైపోతినిగాని లేనిచో వానిని మాయింటనే పరమానందముతో నుంచుకొందునుగదా; జాతిమతభేతములచేత నట్టిప్రాప్తి నాకులేదు" అని వానితో బలికి యది మొదలు రాయబులారు నానకునందు మిక్కిలి భక్తి ప్రేమలు గలవాడై వానికి సుఖమిచ్చు బస నేర్పరుపవలయునని దలపోయుచుండెను.

అట్లుండ నొకనాడు సుల్తాను పురవాసియగు జయరాముడను క్షత్రియుడొకడు పంజాబుదేశ పరిపాలకుడగు