పుట:Nanakucharitra021651mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాడుచేసె" నని బింకముతో బ్రత్యుత్తరము జెప్ప, కొడుకు జూపుమని జెబ్బపట్టుకొని వానిని లాగికొనిపోయి చెట్లచాటుననుండి కొడుకు నీవలకీడ్చి తిట్లవానవానిమీదజిత్తజలుగ గురిపించెను. తండ్రి యెన్నివధముల దూషించినను నానకు తలవంచుకొని ప్రత్యుత్తరము జెప్పక యూరకుండెను. కుమారుడు పుట్టినదిమొదలు వానినెన్నివిధములనో బాగుచేసి తనవృత్తియందు ప్రవేశపెట్టి ధనమార్జింప జేయవలయునని యూటలూరి కాలుడు పుత్రుని యప్రయోజగత్వముజూచి నిర్విణ్ణుడై యాసలన్నియు నడుగంట వాడెందుకు పనికిరాడని చచ్చిననుసరే బ్రతికినను సరే వానిజోలికి బోగూడదని నిశ్చయించుకొనియె.

తండ్రికోపము వడగండ్ల వానవలె మొట్టమొదట విజృభించెనేగాని తరువాత నంత మిక్కుటముగా నుండదగదని నానకు గ్రహించి యాదినము మొదలుకొని తండ్రి చూచుచుండగనే సాధువులతో సన్యాసులతో సహవాసము చేసి మాటలాడజొచ్చె వారిద్దరొక యింటనున్నను దండ్రికొడుకులా గుండక యొండొరుల మెఱుగనివారివలె నుండిరి. కాలునకు గుమారునివలన గలిగినష్ట పరాభవములను నానకునకు గలిగిన యవస్థయు నిరుగుపొరుగు వారందరువిని విచారించిరి. రాయబులారు మరునాడుదయమున కాలునిదనయింటికి రావించి నానకునెడ నతడు చూపినకాఠిన్యమునకు దనకు చాల