పుట:Nanakucharitra021651mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప బరమదయాళువగునానకు పరుగుపరుగున దాపుననున్న పల్లెకుబోయి గోధుమపిండి చక్కెర పప్పుమొదలగు సరకుల గొనితెచ్చి వానికి సమర్పించెను. సన్యాసులు వానింబరిగ్రహించి విందారగించిరి. నానకు వృద్ధసన్యాసితో జాలసేపు వేదాంత చర్చజేసి వారచ్చోటు విడిచినపిదప మెల్లమెల్లన యింటికి బయలుదేరెను. కాని వానియడుగులు మునుపటియట్లు సాగవయ్యె. తనతండ్రి యెట్టివాడో తనకుమూడ దలచిన యాపదయెట్టిదో యెఱుంగుటచే నతడు బెంగగొ దారిలో నడుమనడుమ "అయ్యో నేనేలపరవశుడనై పోతినోయి" యని బలునితో పలుక బలుడును "వద్దని నేనుమొత్తుకొనలేదటోయి నీవు విన లేదు కాని" యని బదులు చెప్పుచు వచ్చెను.

అటుమాటలాడుచు నిరువురు గ్రామసమీపమునకు జేరి నానకు తండ్రికి జడిసి యింటికిబోవక యూరుబయట చెట్లలో దాగికొనెను. బలుడు స్వగృహమునకు బోయెను. కాలుడు రావలసినవేళకు గుమారుడు రాలేదని వగచుచు బలుడువచ్చినట్లు విని విసవిస వానియింటికిబోయి యాత్రముతో దనకుమారుని వార్త యడుగ వాడు జరిగిన వృత్తాంతమంతయు బూసగ్రుచ్చినట్లు జెప్పెను. అదివిని కాలుడు రౌద్రాకారముంబూని ధనముపోయినందుకు నేరమంతయు వానిమీదమోపెను. బలుడు జంకక "నేవద్దని నుడివిన నీకొడుకే