పుట:Nanakucharitra021651mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

నానకు చరిత్ర.

ను. నానకు తండ్రికడ సెలవుగైకొని బయలుదేరినదిమొదలు "ఈదినము మంచి వినియోగమే చేసెద" నన్న మాటలకు తండ్రికిదోచిన యర్ధముకంటె విపరీతార్థము తోచనారంభించెను. ఇందుకు కారణము తండ్రి యభిప్రాయము తెలియకపోవుటకాదు. బయలు దేరిన తోడనే వానిమనస్సు సత్కార్యములమీదికి బోయి శరీరమును బరవశముచేయ నతడు తనతండ్రి యేమిచేసిననుసరే యత డిచ్చినసొమ్ముతో బియ్యము పప్పు మొదలగు సరకులుకొని మారుబేరమున కమ్ముటకంటె యాధనము భగవద్విషయమున వినియోగించుట యుత్తమమని భావించెను.

తండ్రి చెప్పినవిధమున జేయనొడంబడి మరల వాని యాజ్ఞకు విరుద్ధముగా వర్తించుట మంచిదికాదని నానకుకొంతసేపు విచారించెను; కాని వానిహృదయ మెన్నివిధముల మరల్చినను మరలదయ్యె. అతడట్లు ధర్మకార్యస్థిత మనస్కుడై చనుచుండ మధ్యమార్గమున నొక సన్యాసులగుంపు వాని కగపడెను. ఆవిరాగు లదివఱకు కొన్నిదినములనుండి యాహారము లేక మలమల మాడుచుండిరని విని నానకు మిక్కిలిజాలినొంది బలునివద్దనుండి బలవంతముగాసొమ్ముపుచ్చుకొని యాగుంపు పెద్దచేతికిచ్చెను. ఆవృద్ధసన్యాసియు దన కా సొమ్మక్కరలేదనియు దినుటకు పదార్థము లుపయోగించును గాని రూకలుపయోగింప వనియు జెప్పి యాదానమును నిరాకరిం