పుట:Nanakucharitra021651mbp.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నతనమునుండియు గాళుడు వ్యవహారమే చేయుటచే నదియే యుత్తమమైన వృత్తియనియు నదిలేనిచో గొడుకు బ్రతుకలేడనియు గాళుని యభిప్రాయము గావున నతడంత నొక్కిచెప్పెను. కొడుకు తండ్రిపలుకులు తలవంచుకొనివిని మిక్కిలి వినయముతో వెనుక చేసినదంతయు క్షమింప వలయునని యడిగి చేయుమన్న వ్యాపారము తప్పక చేయునట్లొడంబడెను. కుమారునియందేదో మంచి మార్పు కలిగిన దని తండ్రి సంతసించి యాపదును చెడకుండ వానిం దగినపనిలో నియోగింపవలయునని వానిచేతి కిరువది రూపాయలిచ్చి చుట్టుప్రక్క పల్లియలకుంబోయి సరకులుకొని తీసికొనిరమ్మనియు లాభమున కమ్ముమనియు జెప్పి యాచిన్నవ్యాపారములో జాగ్రత్తగా నడచుకొని ధనము మంచివినియోగము చేసినపక్షమున ముందుముందు వాణిజ్యము నిమిత్త మెక్కువధన మిచ్చునట్లు వాగ్దానముచేసి యాసపెట్టెను. అప్పలుకులు విని నానకు "యీధనము మంచివినియోగమే చేసెద" నని నుడివిబయలుదేరి పోయెను. కాళుడు కొడుకునందు పూణన్ విశ్వాసములేనివాడై యెందుకైనను మంచిదని బలుడను నొక కాపువానిని జతయిచ్చి తనకుమారుడు సొమ్ము పాడుచేయకుండ జూడుమని వానితో నొక్కిచెప్పి సొమ్ము కుమారుని చేతికివ్వక బలుని బొడ్డుకొంగున గట్టిగ మూటగట్టి పంపెను. కాళుడెంత జాగ్రత్తపడినను దైవనిణన్‌యము వేరుగనుండె