పుట:Nanakucharitra021651mbp.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నానకు పేదకుటుంబము పుట్టి తనవిజ్ఞానసంపత్తిచేత జగద్గురువై మతకతన్‌యై డెబ్బదియేండ్లు జీవించి జీతకాలములో నొక్కనిమిషమైనను వ్యర్థముచేయక జ్ఞానసంపాదనమునందే వినియోగించి సంసారశృంఖలముల నాసముగ నను ద్రెంపివైచి యెవ్వరికొలువు సేయక దేవ దేవునికొలువే చేసి చరితార్థుడై యాతని సాన్నిధ్యము బడసెను.

నానకు స్థాపించిన మతముపేరు సీకుమతము. తన్మతస్థులు సీకులు అని వ్యవహరింప బడుచున్నారు. వీరు పంజాబు దేశమున విశేషముగ నున్నారు. నానకుయొక్క మతము చైతన్యు వైష్ణవమతమువలె బసవేశ్వరుని జంగము మతమువలె వర్ణభేధశూన్యులై భక్తిరసప్రధానమైయుండును. విగ్రహారాధనము చేయ గూడదని నానకు బోధించెను. వేదమునందితనికి గౌరవము కలదు. కాని యిదియే పరమప్రమాణ మని యత డొప్పుకొనలేదు. జీవహింసాస్పదము లైన క్రతువులు మొదలగు కర్మలు పనికిరావని యతడుగర్హించెను. ఈశ్వరుడొక్కడే యనియు నతడు సర్వశక్తుడనియు సృష్టిస్థితి లయకారుణు డనియు భక్తిచేతనే యతడు సాధ్యు డగుననియు నితనియాశయము. శంకరరామానుజమధ్వాచార్యులవలె నితడు విద్వాంసుడు గాడు. జీవాత్మపరమాత్మభేదములు విచారించి యితడు తత్వనిర్ణయములు చేయలేదు. భక్తిజ్ఞానవైరాగ్యములవలన మానవుడు పాపబంథములు విడిచి యీశ్వరసా