పుట:Nanakucharitra021651mbp.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుజ శుద్ధ దశమినాడు జామురాత్రియుండగ బరమపదము నొందెను. చూనీదేవియు గొడుకులు పీఠాధిపత్యము తమ కుటుంబములో నుంచవలసినదని కట్టకడపటి దినమున సయితము గురుని యడుగులపైబడి వేడుకొనిరి. కాని యతడు నిశ్చయుడై వారివేడుకలుత్రోసిపుచ్చెను. గురుకళేబరమునకు దహనసంస్కారము చేయదలచి హిందువులా శవమును రుద్రభూములకడకు గొనిపోయిరి. అది విని యంతయు మహమ్మదీయులు నానకు తమ మతమే బోధించె ననియు దమవాడే యనియు శవము తమ యధీనమే కావలసినదనియు వాదించి శవమును ఖననము చేయుటకై తెమ్మనిరి. హిందువులందుకు సమ్మతింపకపోగా రెండుతెగలకు భయంకరమైన కలహము వచ్చుటకు సిద్ధమయ్యెను. ఉభయులు కత్తులు దూసిరి. అప్పుడొకజ్ఞాని యాగుంపులోనుండి వచ్చి నానకు వంటి మహాత్ములు తమకళేబరములోనుగూడ విడిచి పోవరు సుడీ యని పలికెను. ఆమాట విని హిందువులు మహమ్మదీయులు గూడ కళేబరమును మున్ను బెట్టిన నెలవునకు బోయి చూడ నచ్చట శవము లేకపోయెను. ఎల్లవారు విస్మితులైరి. ఆయన కప్పుకొన్న దుప్పటి మాత్రము లభించుటంజేసి యది హిందువులు మహమ్మదీయులు రెండుతునకలు చేసి చెరియొక తునక పుచ్చుకొనిరి. హిందువు లాతునకను దహనము చేసిరి. తురకలు నేలపూడ్చిపెట్టిరి. ఈవిధముగ మహానుభావుడైన