పుట:Nanakucharitra021651mbp.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవికింగూడ దోచుటంజేసి సత్యమొప్పుకొనక తప్పదుగావున మనసులో నిష్టము లేకపోయినను నామె రాచవానినె బ్రతిష్ఠింప దగు నని నోటతో ననెను.

ఆమహాపదప్రతిష్ఠుడగు తన శిష్యుడు మత్సరగ్రస్తులైన జనులచేత బీడింపబడకుండ నతని స్వగ్రామమునకే బోయి యుండవలసినదని శాసించెను. తను వచ్చినపని సమాప్తమైనందున నానకు దేహత్యాగము చేయవలసినకాలము సమీపించు చున్నదని గ్రహించి యందుకు సన్నద్ధు డయ్యెను. మరణము సమీపించు చున్నదని యాతడు తెలిసికొని యొక నాడతడు రేపురాత్రిలోపుగ నేను లోకాంతరమున కేగుదునని చెప్పెనట. అతని బసకు సమీపమున నొక మర్రిచెట్టు గలదు. ఆవృక్ష మతనికి మిక్కిలి ప్రియము. అతడు పలుమాఱు దాని నీడకు వసియించి సుఖించెను. ఆదినమున గూడ నత డాచెట్టుక్రిందనే తన సెజ్జలపరపించుకొని పండుకొనియెను. ఆమహాత్మునకు గాలము సమీపించినదని విని హిందువులు మహమ్మదీయులు గూడ గడసారి యాతని దర్శనము జేయగోరి గుంపులు గుంపులుగ బోయి చూచి ధన్యులైరి. మరణము నిమిత్తము ప్రత్యేకముగ నతడు గట్టించుకొన్న యింటిలోనికి దన్ను తీసుకొని పొమ్మని సాయంకాల మతడు కోరెను. ఆగృహమున స్వబంధువులయొక్కయు శిష్యగణము యొక్కయు సన్నిధి నతడు 1526 వ సంవత్సరమున నాశ్వ