పుట:Nanakucharitra021651mbp.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుశిష్యులకు గలపరిచయము స్వల్పకాలమునుండి యైనను నారాచవానిభక్తిజ్ఞాన వైరాగ్యములు గురువుమనస్సును సంపూర్ణముగ గరగించి యతనియందు పుత్రవాత్సల్యము గలిగెను.

తనయనంతరమున దాను బోధించిన మతములోకమునకు బోధించుటకు దగినవా డారాచవాడే యని నానకు వానినే పీఠాధిపతిం జేసెను. ఈకార్యము చూనీదేవికి మిక్కిలి కష్టముగ నుండెను. పీఠాధిపత్యము కుటుంబమునకు గౌరవము విశేషముగ గలిగించుటయె గాక కట్నములు కానుకలు మొదలగువానిరూపమున ధనలాభము గూడ గలిగించును. గావున నట్టిమహాపదవి తనకొడుకులకు రాక పరాధీనమగుటచే నాయిల్లాలు మిక్కిలివగచి యది తనపుత్రులయందె నిలుపు మని యతనిం బ్రార్థించెను. కాని మతబోధకు డైన పీఠాధిపతికుండవలసిన లక్షణము లేవియు దనకుమారులయందు బొడకట్టక క్షత్రియునియందె పొడగట్టుటచేత నతడు లోకోపకారార్థమై పుత్రస్నేహ మొకమూలకు ద్రోచి మతవ్యాప్తియె ప్రథానముగ జేసికొని యిల్లాలి మొఱలు పెడచెవిని బెట్టి రాచవానినె పీఠమున బ్రతిష్ఠించి యతనికి యంగదుడనునామమిచ్చెను. చూనీదేవి నెట్లయిన తనకావించిన యేర్పాటున కొడంబరుపదలచి నానకు తనకుమారులను రాచవానిని బలుసారులు భార్య యెట్టయెదుట బహువిధముల శోధించెను. ఆశోధనలలో క్షత్రియుడె సర్వవిధముల శ్రేష్ఠు డని చూనీ