పుట:Nanakucharitra021651mbp.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చిరని యతని కానందములేదు. విచారము లేదు. సన్యాసులకు తమమనస్సె సమస్తానందములు గలుగ జేయును. గాని బాహ్యవస్తువులు సంతోష మొసంగ జాలవు. అత డీవిధముగ నొకచోట స్థిరముగ నుండుటవలన గొప్ప ప్రయోజనము గలిగెను. ఆమహాత్ము డదివఱకు బోధించిన బోధనములవలనను గానముచేసిన గీతములవలనను చేసిన వాదముల వల్లను నతని యభిప్రాయములు దెలియుచుండినను నవి యొక వరుసలేక చెదిరి విడివిడిగా నుండుటచేత నెల్లవారికి సులభముగ లభింపకుండెను. పూర్వోత్తర సందర్భములు చక్కగా గమనించి యవి యొకచో జేర్చివ్రాసి లోకుల కుపయోగముగనుండునట్లు చేయవలసిన భారము తనపై నుండెను. ఒకచో స్థిరముగ నుండుటవలన గలుగు ముఖ్యప్రయోజన మిదియె. ఆకర్తారపురమందుండి నానకు తనపని నెఱవేర్చుచుండ లెహనుడను నొకక్షత్రియుడు విష్ణుదేవి యనుక్షత్రియువకు యాత్రపోవుచు నీగ్రామమునకు బోయి యచ్చోట మహానుభావుడొకడున్నాడనివిని యాతని సందర్శించెను. ఆక్షత్రియుడు కర్తారపురమున నొక్కదినము మాత్రమె యుండదలచెను. కాని నానకుయొక్క బోధామృతపానముచేత నతడు పరవసు డై యచ్చోటు విడువజాలక నిరంతర శుశ్రూషలచేతను పరమార్థగ్రహణముచేతను వినయవివేక సంపత్తిచేతను సత్ప్రవతన్‌నముచేతను గురువుయొక్క యనుగ్రహము బడసెను.