పుట:Nanakucharitra021651mbp.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డెను. యావజ్జీవ మచ్చటనే యుండవలసిన దని పినతండ్రి నానకు ననేకవిధముల బ్రతిమాలెను. కాని యతడు దానికి సమ్మతింపలేదు. నానకు తన్ను విడిచిపోవునప్పుడు పినతండ్రి గుఱ్ఱమొకదానిని తెచ్చి సుకరముగ బ్రయాణము సేయుటకు వీలుగ నుండును గనుక దానినైన బరిగ్రహింపవలసిన దని పలువిధముల వేడుకొనెను. అదియు బరిగ్రహింపక నానకు వానికిట్లనియె. నేను భగవంతుని కొలువు చేయుచున్నాను.. ఇప్పుడు నామనస్సులో నేవిధమైన సంతాపము గాని బెంగగాని భయము గాని సందేహము గాని లేదు. ఇది పెట్టుబడిలేనివ్యాపారము కాని లాభము విశేషముగ వచ్చుచున్నది. ఇది యిమ్మని అది యిమ్మని యడుగువారు లేరు. ఎంతయదృష్టవంతులకో గాని యిటువంటి బేరము తగులునా అట్లు చెప్పి పినతండ్రిని వీడ్కొని చిరకాలమునుండి తన్ను సేవించుచున్న బలుని తన శుశ్రూషాబంధమునుండి విడిపించి యధేచ్చముగ విహరింపవలసిన దని యానతిచ్చి బియాసునదీతీరమున మిక్కిలి మనోహర మైనయొక స్థానము తనకు నిలయముగ నేర్పరచుకొని యాస్థానమునకు విశ్వకతన్ యగుపరమేశ్వరునిపేరు పెట్టదలచి కర్తారపురమని నామమిడెను. ఇచ్చట సాధువులు యోగులు పెక్కండ్రు చేరి యతనిని సేవించి యతని సహవాససౌఖ్య మనుభవించిరి. అతనిభార్య యగుచూనీదేవియు నానకుయొక్క కొడుకులు గూడ నచ్చోటనే జేరిరి, ఆబిడ్డలు '