పుట:Nanakucharitra021651mbp.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందు మిక్కిలి పేరుగాంచిన సన్యాసి యయ్యెను. ఈవిధముగ హిందువులు మహమ్మదీయులుగూడ నతని శిష్యులుగను వచ్చిరి.

మామగారియూర నాలుగుసంవత్సరములుండి మామగారి మరణానంతరమున నతడు గ్రామము విడిచిపెట్టెను. అప్పటి కతనికరువది సంవత్సరములు నిండెను. మునుపటివలె దీఘన్‌ప్రయాణములుచేయుట కోపిక లేకపోయెను. అందుచేత స్వస్థలము విడిచి దేశాంతరముల కరుగగూడ దని యతడు నిశ్చయించుకొనెను.

చరమావస్థ

నానకు షష్టిహాయన పూతిన్ చేసినందున మనుపటివలె సాధువులయొక్కయు సన్యాసులయొక్కయు పకీర్లయొక్కయు సహవాసము చేసి వేదాంతగోష్టితో గాలము బుచ్చుట కవకాశము లేకపోయెను. ఏదోయొకచోట స్థిరముగా నుండి పశ్చిమవయస్సు గడుపవలయునని నిశ్చయించి యేగ్రామము తనకనుకూలముగ నుండునోయని యతడు విచారింపదొడగెను. అట్లొకస్థానమేర్పరచుకొనక మునుపు జన్మభూమియగు తాల్వెండి కరిగి పిత్ర్వంశస్థులలో హతశేషుల నొకసారి చూడవలయునని కోరిక గలిగినందున నతడచ్చట కరిగెను. అతని పినతండ్రి యగులుల్లామాత్రమప్పటికి జీవించి యుండెను. నానకు పినతండ్రియింట బదునైదు దినములుం