పుట:Nanakucharitra021651mbp.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనంతరము నతడు మామగారి యూరికి వచ్చెను. ఒకనా డత డాగ్రామమున నొక చెట్టుక్రింద గూర్చుండ జాటుజాతివాడైన యొకబాలుడు పశువులం దోలుకొనుచు నాదారిం బోయెను. వానిపేరు బూరా అతనిముఖవైఖరిం బట్టి సద్గురూపదేశము గలిగి సత్పురుషునిచేత శిక్షితు డైనపక్షమున నాబాలకుడు మహాపురుషుడు కా గలడని గురువు తెలిసికొని వానిం దనకడకు రమ్మని చేసన్న జేసెను. అబాలుడు తక్షణమె యాతనిసన్నిధికిం బోయి యేలపిలిచితిరని యడిగెను. పనియేమి లేదు. ఊరకపిలిచితినని గురు వుత్తరము చెప్పెను. లోకఖ్యాతకీతిన్ యైన మహానుభావుడు తగవంటి యర్భకుని నిర్హేతుకముగ బిలువ డని యబ్బాలుడు తలంచి మరునా డొక చెంబునిండ నేయి బోసికొని యతని దర్శనమునకు బోయి తనతెచ్చిన కానుక గ్రహింపు మని ప్రార్థించెను. నీతలిదండ్రులతో జెప్పి యిది తెచ్చితి వా వారియెరుకలేక తెచ్చితివా యని నానకు డింభకు నడిగి మాతాపితలకు దెలియకుండ దెచ్చితి నని యతడుత్తరము చెప్ప గృహయజమానులకు దెలియకుండ దొంగతనముగ దెచ్చిన వస్తువు పుచ్చుకో నని బాలకు డెంత బతిమాలినను దానిని గ్రహింపక పంపివైచెను. అనంతర మాబాలకుడు ప్రతిదినము గురుసందర్శనము జేసి క్రొత్తవిషయములు నేర్చికొనును గొంతకాలమునకాతనికి శిష్యుడై పంజాబుదేశ