పుట:Nanakucharitra021651mbp.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డలేదు. మొగలాయి వంశస్థు డగుబేబరు కట్టకడపటిసారి హిందూదేశముపై దండువెడలి పానిపట్టువద్ద యిబ్రహీము లోడీని గెలిచి యతనిం జంపి డిల్లీసింహాసన మెక్కెను. అతడు గద్దెయెక్కిన యెనిమిదవనాడు మహానుభావు డైనయోగి యొకడు పూర్వచక్రవతిన్ చేత నిహేన్‌తుకముగ జెఱబెట్ట బడెనని విని తక్షణమే యతనిని వదిలిపెట్టవలసినదనియు మిక్కిలి గౌరవముతో దనసన్నిధికి దోడ్కొని రావలసినదనియు నానతిచ్చెను. అతని యాజ్ఞాప్రకారము బందెకాడు వానిని జక్రవతిన్ సన్నిధికి దోడ్కొని పోయెను. చక్రవతిన్ యతనితో భగవద్విషయమై సంభాషించి యతడిచ్చిన యుత్తరములకు సంప్రీతుడై ప్రీతుడై వీడుకొలిపెను. ఏడుతరములవఱకు బేబరుసంతతివారు హిందూస్థానము పరిపాలింతురని యాసమయమున బేబరుతో నానకు చెప్పెనని కొందఱు చరిత్రకారులు వ్రాసిరి. అట్లు మొగలాయి చక్రవతిన్‌ని వీడ్కొని నానకు మరల దేశాటన మారంభించి కాశ్మీర దేశమునకు బోయియచ్చట దనసిద్ధాంతములను బోధించి ప్రసిద్ధు డైక యొక బ్రాహ్మణుని దనమతమునం గలపుకొనియెను. నాటం గోలె బెక్కండ్రు నాతని మతమును స్వీకరించి శిష్యులైరి. కాశ్మీరమునుండి యతడు లాహోరుపురమునకు వచ్చెను. ఆపురవాసియు మిక్కిలి పలుకుబడి గలవాడు గొప్పవాడునగు నొకతురక యమీరుగూడ నతని శిష్యు డయ్యెను.