పుట:Nanakucharitra021651mbp.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్నిధ్యము నొందునని యతడు బోధించెను. సీకులమతగ్రంథముపేరు ఆదిగ్రంథము. దీనికే గ్రంథసాహెబులని పేరు. దీనిలో నానకుయొక్కయు నతని యనంతరమున మతరక్షకులైన గురువులయొక్కయు సిద్ధాంతము లున్నవి. ఇతడు తులసీదాసు కబీరుదాసు మొదలగువారియట్లే పరమభాగవతోత్తముడు. ఈమతము పదియవ గురువగు గురుగోవిందుని కాలమున మహోన్నతమైన స్థితికి వచ్చెను.

సమాప్తము.