పుట:Nanakucharitra021651mbp.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యను మహమ్మదీయుడుండి చక్రవర్తికి నానకుమీద నమితద్వేషము కలుగునట్లు చెవిచెంతజేరి కొండెము లెన్నెన్నియో చెప్పి యతని మనస్సు పాడుచేసెను. ఆమహమ్మదీయుడు చక్రవతిన్‌తో నీతెఱంగున జెప్పెను. ఈనానకు మహమ్మదీయ మతమునకె గాక హిందూమతమునకు గూడ ద్రోహవిగ్రహారాధనము సేయగూడదనియు వణన్‌భేదము దూష్యమనియు నితడు హిందువుల నధిక్షేపించును. గోవధము పాతకమనియు మహమ్మదువారు జగద్గురువు కారనియు మనల నధిక్షేపించును. కావున నిత డుభయమతస్థులకు విరోధియే కావున సర్వవిధముల దండ్యుడు. ఆపలుకులు చక్రవతిన్‌కి నచ్చెను. ముత్సద్దికి గాని చక్రవతిన్‌కి గాని హిందూమతము మీద నిజమైన యభిమాన మున్నదని మనము నమ్మగూడదు. మహమ్మదీయ మతము నధిక్షేపించుట చేతనే ముత్సద్దీకి నానకుపై బట్టరాని యాగ్రహము వచ్చెను. తనమతమును దూషించి నందుకు నానకును దండించినచో హిందువులకు గష్టముగ నుండు నని ముత్సద్దీ హిందూమతముమీద నత్యంతాభిమాన మున్నట్లభినయించి చక్రవతిన్ కాపరమసాధువు మీద సారములేని కోపముదెప్పించెను. ఆకోపాదేశమున జక్రవర్తి నానకును జెఱసాలలో బెట్టించెను. మహాపురుషులకు గృహములు కారాగృహములు నొక్కవిధముగానే యుండు ననుమాట భోగపరాయణు డైన చక్రవతిన్ యెఱుగడు, జీవ