పుట:Nanakucharitra021651mbp.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెన్నడు సేయవని నీవు ప్రమాణము చేసిన పక్షమున నిన్ను విడిచెదము. లేదా యీచేపను నీవు కోసినట్లే నిన్ను ముక్కలుముక్కలుగా గోసెదమని వారుత్తరమిచ్చిరి. అపుడు నానకు వారి కిట్లనియెను. మనుష్యుడు మాంసమునుండి పుట్టెను. మాంసముతోనే పెరుగుచున్నాడు. కావున మాంసమునందు నంతద్వేష ముండవలసిన యవసరము లేదు. పూర్వాచార పరాయణులైన యామూడభక్తులు వానిమాటకు దగిన ప్రత్యుత్తరము చెప్పలేక యతడు జ్ఞానసంపన్నుడైన మహాయోగి అతని జోలికి మనము పోగూడదని చల్లచల్లగ జారిరి. నానకుగురువుయొక్క ప్రతిష్ఠ దేశమంతటను ముఖ్యముగ బంజాబుదేశమునను గ్రమక్రమముగ వ్యాపించెను. అత డొకమతమును మెచ్చలేదు. ఒక మతమును ఖండింపలేదు. ఏమతమునందైనను దోషములున్న పక్షమున నాదోషముల నతడువిమర్శించి ఖండించుచు వచ్చెను. దీనిఫలిత మేమనగా బ్రతి మతస్థులు నతనింగూర్చిన కథలువినుచు నతని గుణగణములు భక్తిశ్రద్ధలు జెప్పుకొనుచువచ్చిరి. అంతకంతకతనికి యశస్సు డిల్లీచక్రవర్తి యొక్క కొలువుకూటమువఱకు వ్యాపించెను. ఆకులమున భోగపరాయణు డైన యిబ్రహీములోడీ డిల్లీచక్రవర్తిన్‌యై యుండెను. ఆడిల్లీ చక్రవతిన్ కితనిగొడవ లక్కఱలేదు కాని యాయన యాస్థానమునందు స్వమతాభిమానియు నానకు సిద్ధాంతములయందు ద్వేషము గలవాడు నగు ముత్సద్దీ