పుట:Nanakucharitra021651mbp.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వనియు ధర్మశాలలే తన గృహములనియు జెప్పి యతనింబంపెను.

మామగారి గ్రామమైన పఖోకరండవాలో నానకు రెండుమాసము లుండెను. ఆకాలములో నజ్ఞానతమ: పటలముచేత నావృతములైన యనేకమనస్సులయందు జ్ఞానదీపములను వెలిగించి వారిని యీశ్వరభక్తులుగ జేసెను. అంతకంత కతనిపేరు పరిసరభూములయందు వ్యాపించుటజేసి జ్ఞానసంపాదనము నిమిత్తము జనులు పెక్కండ్రతని సన్నిధికి రాదొడగిరి. మాసద్వయ మాగ్రామముననున్న తరువాత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు గొప్పతీర్థము జరుగునని తెలిసినందున నానకు బలునిగూడి యచ్చటి కరిగెను. ఆర్యావర్తమాన మందలి మహాపుణ్యక్షేత్రములలో గురుక్షేత్ర మొకటి. ఈ క్షేత్రముందే భగవానుడగు శ్రీకృష్ణుండు తన మేనమరదియు జెలియలి మగడును గారాపుచెలికాడునగు నర్జునునకు రథసారధియై పార్థసారథినామధేయంబున బ్రసిద్థుడై కురుపాండవ సైన్యమధ్యమున నరదంబున నిలువంబెట్టి యుపనిషత్కారమైన భగవద్గీతాశాస్త్ర మాధవుం డాయన కుపదేశించెను. ఈక్షేత్రమునందే కురుపాండవ రాజకుమారులు కౌరవసామ్రాజ్యము నిమిత్తము పెచ్చుపెరిగినమత్సరంబున మహాసంగ్రామము గావించి నిహతులైరి. ఈక్షేత్రమునందే యాకాలపురాజనందను లందము కౌరవపాండవులలో నేదోయొక