పుట:Nanakucharitra021651mbp.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నజట్లుగా జేరి దారితప్పి పోవుబాటసారులను గలిసికొని వారిని దమమఠమునకు దోడ్కొనివచ్చి సత్కరించుచుందురు. ఆగుంపులలో నొక్కటి వృక్షచ్ఛాయం గూర్చుండిననానకుం గనుంగొన తమమఠమునకువచ్చి యతిథి గావలసినదని వానిని గోరెను. ఆతరుచ్ఛాయయె తన కారాత్రి నివాసయోగ్య మగు నెలవగుననియు దా నదివిడిచి రాననియు నతం డుత్తరము చెప్పెను. వారతని యుత్తరము మఠాధిపతి కెఱిగింప నతడు కదలిఫొయి స్వయముగ నతని నాహ్వానము జేసెను. అతని కోరిక నిరాకరించుట మోటతన మగునని తలంచి గురువు తన యనుచరుని గలసి మఠమున కరగి యతిధియై వారిచ్చు సత్కారములనంది సంతుష్టుడయ్యెను. అత డామఠమున నొకటిరెండుదినము లుండి మరల బయలుదేరి తెంపులేని పయనములు చేసి తనమామగారైన మూళుడు వసియించుగ్రామము చేరెను. అప్పటికతడు పదియారు సంవత్సరములనుండి ప్రయాణముచేయుచుండెను. ఆగ్రామమునకు నానకు వచ్చినాడని వినినతోడనే ముదిమిచే నవయవపటుత్వము దప్పిన మూళుడు కన్నులార నల్లునొక్కసారి గని యతని నింటికి దోడ్కొనిరావలయునని శ్రమపడి యతడున్న ధర్మశాలకు బోయి సబహు మానముగ నతనిని దర్శించి తనయింటికి రమ్మని వేడుకొనెను. గురువు బహుమానముల స్వీకరింపక యతని గృహమునకు బోవుటకు సమ్మతింపక హరినామస్మరణమే తనకాప్తబంధు