పుట:Nanakucharitra021651mbp.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిక్కిలి ప్రేమతో నాదరించెను. నానకు జ్ఞానసముద్రుడైన బాబావలీయొక్క సహవాస సౌఖ్యము కతిపయ దినములనుభవించి మునుపటికన్న జ్ఞానసంపన్నుడై యచ్చోటువిడచి స్వదేశాభిమాను డయ్యెను. మార్గమధ్యమున మానచందుండను క్షత్రియు డాయన కగపడెను. ఈరాచవానికి మతాసక్తి మెండు. ఎవ్వరైనదనకు సన్మతోపదేశము చేసి మంచిదారి చూపువారు దొరకుదురాయని తగినగురువునిమిత్త మత డెదురుచూచు చుండెను. మంచినీరు త్రాగబూనువారికి మహాసరోవర మగపడినట్లు నిరుపేదకు పెన్నిధి లభించినట్లు నానకువంటి జ్ఞానరత్నాకరు డాజ్ఞానదరిద్రునకు దొరకినతోడనే యతడు తనయదృష్టముచేత లభించెనని సంతసించి యనేక దినములు సుశ్రూషజేసి బహు సంవత్సరములనుండి దేనికై యన్వేషించు చుండెనో యాబ్రహ్మజ్ఞానఫలమును దని నొంద ననుభవించెను.

తిరిగి పయనము చేయునపుడు నానకు బాలనాధపర్వతమునొద్ద జుట్టుప్రక్కల నెక్కడ నూరుపల్లెలు లేని నట్టడవిలో నొకచెట్టుక్రింద శిష్యద్వితీయుడై దారితెన్ను కానక మెసగుట కాహారములేక బడలి గూర్చుండెను. ఆకొండదాపున జోగులమఠ మొకటి గలదు. ఆజోగుల కొడయడైనయోగి పరమదయాళువు పరోపకారపరాయణుడు. అతని యాజ్ఞాప్రకార మాజోగులు ప్రత్యహము సాయంసమయమున చిన్న