పుట:Nanakucharitra021651mbp.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుదురని ధర్మోపదేశము చేసెను. అతితక్షణమైన మాయుపదేశముయొక్క వేడిమిచేత నమ్ముదుసలి దొండయొక్క రాతి గుండెయు గలిగి నీరై పోవ నతడు పశ్చాత్తప్తుడై దు:ఖపరవశుడై తన కావించిన దోసమొప్పుకొని తప్పు సైరింపుమని వేడుకొనెను. ఆపురుషత్రయ మాస్థానము విడిచి కొంతదవ్వరుగునప్పటికి మర్దనుని సమాధి యున్న యూ రగుపడెను. ఆసమాధి దృస్టపథమునం బడినతోడనే భస్మరూపు డైన తనతండ్రి యాసమాధిలో నున్నాడనివిని సజ్జదుడుపితృభక్తి తరంగితాంతరంగుడై యాస్థానము విడిచి రా జాల నని గురువుతో జెప్పి యచ్చటనె జీవిత శేషము గడుప నిశ్చయించుకొనెను. సజ్జదుడు తన్నువిడచుటచేత గానము తన చెవులకింక వినబడదని గురువు వానిని విడువలేక విడిచెను. శుభము సంప్రాప్తించినప్పుడు మేర మీఱిన యానందమును కష్టము సంప్రాప్తించినప్పుడు డపారమైన దు:ఖమును బొందుట ధీరలక్షణము గా దని శ్రీకృష్ణుడు భగవద్గీతలలో జెప్పిననీతి స్మరించుకొని యతడు సజ్జదునివియోగముకొఱకు విచారము నొందలేదు. అట్లు సజ్జదుని పితృసమాధికడ నెలకొలిపి బలోపేతుడై నానకు బహుదినంబులు ప్రయాణములుచేసి గాంధారుదేశమునకు హిందూదేశమునకు నడుమ నున్నకొండలలో ప్రసిద్ధమైన బొలాను కనుమదాటి కడుశ్రమపడి యెట్లకేలకు గాంథారము జేరెను. బాబావలీవారిని