పుట:Nanakucharitra021651mbp.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాలకు దీసికొనిపోయి మధురాహారములతో విందు సేయుమని సేవకుల కానతిచ్చెను. సేవకులును కడుపార వానికి మెక్కబెట్టు వారుపోలె సత్యాదరమున వానిని లోనికి దీసికొనిపోయి యోగిరముపెట్టుటకు మాఱు వాని కట్టినపుట్టము లొలుచుకొని తిండిపెట్టక కాలు సేతులు గట్టి మారుమూల గదిలో బడవైచిరి. ఇదిజరిగిన కొంతసేపటికి గురుడు బలుసమేతుడై యచ్చోటికి బోయి సజ్జదుని గానక యావృద్ధుని బిలిచి తనశిష్యుని శరీరాదులు వణిన్ంచ యానవాలు చెప్పి యట్టిలక్షణములు గల పడుచువాడు మీ కగుపడినాడా యని యడిగెను. అట్టికుఱ్ఱవాని మొగమైన జూడలేదని యా యోగి భృవుడు నొక్కిపలుక వాని మాయమాటలు దొంగచూపులు గురువున కనుమానము గలిగించెను. తోడనే బలుడును దానును సజ్జదునికొఱకు పలుతావులు వెదకిరి. ఎట్టకేల కన్నములేక మిక్కిలి ఖిన్నుడై యొకమూలబద్ధుడై యున్న సజ్జదున వారు కనుంగొని వానికట్లు విప్పి విముక్తంజేసి యావృద్ధుం బిలిచి నిరపరాథు లగు బాటసారుల నావిధముగ నిష్కారణముగ దోచుకొని చెఱబెట్టవలసిన యవసరమేమివచ్చినని మిక్కిలి కఠినముగ నడిగిరి. అడగుటతో దనివినొందక గురువు కపటయోగింజూచి సాథుబాధ పరమపాతకమనియు నది కావించిన దురాచరణము లిహలోకమునకు జెడుటయే గాక పరలోకమునకుగూడ జెడి దుర్గతులపాల