పుట:Nanakucharitra021651mbp.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పక్షముబూని మహానామప్రళయానలమునకు మిడుతలై కధావశేషులైరి. మహాభారతసంగ్రామము జరిగి రమారమి యిప్పటికి నాలువేల సంవత్సరములైనను ననేక రాజఋషులచ్చట రణనిహతులై వీరస్వర్గము జూరగొనుటచే నాటగోలెనది భువనపావనమైన పుణ్యక్షేత్రమై పుణ్యాత్ములకెల్ల సేవ్యమై పురాతనచరిత్రాభిలాషులకు గూడ నభిగమ్యమై విరాజిల్లుచున్నది. ఈకారణముచేతనే నానాకాస్థలమునకు బోయి యుండును. ఆసంవత్సరము సమ్మేళనము మిక్కిలి గొప్పది. అన్నివణన్‌ములవారు నన్నిమతములవారు నచ్చట సమావేశమైరి. కాని కాలక్షేపము నిమిత్తము వేడుకనిమిత్తము వేళాకోళము నిమిత్తము విహారము నిమిత్తము వచ్చినవారే కాని తీర్థవాసులలో ననేకులు నిజమైన భక్తితోడను శ్రద్ధతోడను బరమార్థముతోడను వచ్చినవారు లేరు. హోమములు గావించువారు స్వాధ్యాయము చెప్పువారు భజనలు సేయువారు స్నానములు సలుపువారు జపములు చేయువారు తపోనిరూడు లైనవారు ధర్మోపదేశములు చేయువారు వేనవేలు గనబడిరి. విగ్రహారాధనము విరివిగా జరిగెను. నిష్కళంక మైనభక్తి నిజమైనవైరాగ్యము సత్పుత్రదానము సాధుసేవ బ్రహ్మజిజ్ఞాస మొదలగునవచ్చట మృగ్యుములయ్యెను. నానకువంటి వేదాంతకవియన్నియు నసహ్యములై తోచెను. ఆజపములు తపములు దానములు ధర్మములు బ్రహ్మజ్ఞాననిష్ఠు డైన యామహాత్మునకు