పుట:Nanakucharitra021651mbp.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనేకులతో వేదాంతచర్చలు జరిగెను. ఆచర్చలు వివాదహేతువులు గాక యతనికి సంతోషప్రదములై రెండవపక్షము వారికి జ్ఞానసంధాయకము లై యుండెను. రామేశ్వరయాత్ర నుండి యతడు తిరిగివచ్చి కొందఱు సాధువులు గురుదాసుపురముజిల్లాలో నున్న బాటలె యనుపుణ్యక్షేత్రమునకు బోవుచున్నా రని విని యాసాధువులసహవాసము చేయుటకును తనజన్మభూమినింకొకసారి సందర్శించుటకును నిశ్చయించి వారితో గలిసి యచ్చోటి కరిగెను. బాటలేగ్రామవాసులకును నచ్చట చేరినతీర్థవాసులకును సనాతనసిద్ధాంతములకును వ్యతిరేకమైనమతబోధ చేయుచున్ననానకుయొక్కరాకయసహ్య మయ్యెను. ఆమెమహాత్మునియెడల వారెంతద్వేషభావము బూనిరో యెంతకఠినముగ దూషించిరో యెంతయవమానపఱచిరో మనము చెప్పజాలము కాని యెంద రెందరుసాధువులు తనతో వితండవాదములు చేసి వెఱపించినను వెఱవనిధీరుడు పలుపల్లియలయందు బట్టణములయందు వసియించు పూర్వాచార పరాయణుల కోపానలాజ్వాలలబాఱి బడనిశ్చలుడు వేనవేలుజనులు వచ్చి ప్రశ్నలవర్షము గురిపించి వాదించి యోడిపోయి తుదకు నిందించినను మనోధైర్యము చెడనిపరమశాంతుడు. బాటలేగ్రామము విడిచి వెడలవలసినవా డయ్యెను. "అతిపరిచయాదవజ్ఞ:" యన్నట్లు పిన్ననాటనుండియు దన్ను దనకుటుంబమును దనగృహపరిస్థితులను దనబాల్యవిచేష్టితము