పుట:Nanakucharitra021651mbp.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను నెఱిగిన కాకులవంటి లోకుల నడుమ నున్నప్పుడు శాంతాంత:కరణుడగు పరమతపోధను డైనను వారివెక్కరింపులగ్గలమైనతరి తనశాంతము చిక్కబట్ట జాలడు.

పంజాబుదేశము విడువకమున్ను మృతినొందిన మర్దనుని స్థానమందు దనకు మఱియొక శిష్యుడు సంప్రాప్తించునేమో యని వెదుక జొచ్చెను. ప్రియశిష్యు డైనమర్దనున కొక్కకుమారు డుండె నని యతని కప్పుడు జ్ఞప్తికి వచ్చెను. ఆబాలకునిపేరు సజ్జదుడు. ఆకుమారు డెట్లైన శిష్యుడుగ బరిగ్రహించుటకు గురువును బలుడును గృతనిశ్చయ లై తమరాక గ్రామవాసుల కెవ్వరికిం దెలియకుండునట్లు రాత్రి ప్రొద్దుపోయిన తరువాత తాల్వెండిగ్రామమునకు వెళ్ళిరి. గురు వొకమారుమూలను గూర్చుండి సజ్జదునికడకు బలుని పంపెను. అత డతిరహస్యముగ బోయి గురుసందేశ మెఱిగించినతోడనే సజ్జదు డెంతకాలమునుండియొ ప్రయాణ మగుచున్నవాడ పోలె గడియయాలస్యమైన జేయక వెంటనే మూటముల్లె గట్టుకొని వానితో బయలుదేఱెను. అతనినిజూచి నానకు వానితండ్రియొక్క మరణవార్తను దెలిపెను. నానకు యొక్క తల్లియు దండ్రియు గతించినా రని సజ్జదు డెఱిగించెను. గురువుయొక్క పినతండ్రి మాత్రము బ్రతికి యుండె ననియు నిష్టమైనచో నతనిని జూడవచ్చుననియు సజ్జదుడు విన్నవింప గతన్నాస్థి మృతినొందిన వారికొఱకు వి