పుట:Nanakucharitra021651mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కువద్ద శిష్యు డైనప్పుడు వాడు తనజాతియందు మిక్కుటమైనయభిమానము గలిగి యాశాపాశబద్ధుడై స్వలాభపరాయణుడై నెల్లవారి నెగతాళి సేయుస్వభావము గలవాడై చీటికి మాటికి సణుగుకొనుచు లోకవ్యవహారములయందెయాశక్తి గలిగి యుండెను. కాని కాలము గడచినకొలది గురువు యొక్కసదాచారసంపత్తి యీశ్వరభక్తి లోకోద్ధరణాశక్తి కన్నులార జూచినకొలది నతనిధనకాంక్ష స్వలాభపరాయణత మొదలగు సామాన్యమానవలక్షణము లడుగంటెను. భక్తిజ్ఞానవైరాగ్యములు వానిస్థానము నాక్రమించెను. అవి హృదయమున నెలకొనుటయు నతడు నిరర్థకసంభాషణములతో గాలక్షేపము సేయక సణుగులుగొణుగులు మాని పరాక్షేపణలు గట్టిపెట్టి జ్ఞానమార్గమున బడి బ్రహ్మానుసంధానపరాయణు డయ్యెను. ఆతనియందు గలిగినమార్పులు గనిపెట్తి సంతసించి యజ్ఞానకవచమును విడిచి జ్ఞానకవచమును దొడిగికొని తనశిష్యుడు దేహయాత్రచాలించినందుకు సంతసించెను.

మర్దనునిమరణము నానకుయొక్క సంకల్పమునకు మార్పు కలిగించెను. పంజాబు దేశమునకు బోవలయునని యంతకుముం దత డాలోచించెను. కాని ప్రియశిష్యుడైన బలుడు సేతుబంధరామేశ్వరయాత్ర చేయవలయునని కుతూహలపది నందున నతనిమనోరధసిద్ధి గావించుటకై యతడు దక్షణాపథంబున కరుగ సంకల్పించెను. ఈప్రయాణమున నానకును