పుట:Nanakucharitra021651mbp.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురువుతో మనవి జేసికొనెను. శిష్యునియిచ్ఛాప్రకారమె గురువు కళేబరమును ఖననము సేయక నగ్నిపాలు చేయుటకే కృతనిశ్చయుడై తద్విషయప్రయత్నములు చేసెను. ఆమువ్వురు కప్పుడుగలసొత్తు మూడుశాటులు ఆశాటీత్రయమును నానకు శిష్యునికళేబరము జుట్టబెట్టి స్వహస్తనిర్మిత మైనచితి మీద శవమును బలుడుందానును బెట్టిరి. అగ్నిసంస్కారము బలునిచేత చేయింపక శిష్యవత్సలు డాకట్టకడపటికర్మముగూడ దనచేతులతోనే చేసెను. శిష్యునకు చుట్టము లెవ్వరు లేమి యతనియుత్తరక్రియలు చేయుట దర్మమని గురువు స్వయముగానె పారలౌకికక్రియలు చేసెను. నిజమైనప్రేమ యెక్కువతక్కువస్థితులుగాని వర్ణభేదముగాని పాటింపనీయదుగదా. "ఉదారచిత్తానాం వసుధయేవకుటుంబ:" యనునట్లు మహానుభావులకు లోకమే కుటుంబము. మర్దనుడు గురువుతో జిరసహవాసము జేయుటంజేసి మౌడ్యము బాసి జ్ఞానమించుకయైనసంపాదించెనా యని కొందఱు సంశయముపడవచ్చును. అట్లు సందియముపడుటకు వలనుపడదు. ఏలయన మంచిపూలు గుచ్చినదారముసైతము సువాసన గలిగి యుండును. అట్లె బ్రహ్మజ్ఞానసంపన్ను డైననానకువంటిమహానుభావునితో జిరకాలము కలసిమెలసియుండి యతడు సేయువేదాంతచర్చలు పలుమాఱు వినివిని యున్న మర్దనునకు జ్ఞాన మంటదనుట యసంభవము. మొట్టమొదట మర్దనుడు నాన