పుట:Nanakucharitra021651mbp.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్పుడు మఱికొంతకాల మతనిసహవాససౌఖ్యము గలుగకపోయెగదా యని విచారించిరి. హిమాలయమున దిరుగుకాలమున శిష్యు డగుమర్దనునిశరీరస్థితిచెడెను. నానకుయొక్క శరీరము శీతోష్ణములకు జంకునది కాదు. రెండవశిష్యు డగుబలునిశరీరము నంతగా గాసిజెందలేదు. కాని మితిమీఱినయాచలియు నెడతెంపు లేనియావానలు నెల్లపుడు మంచుమీదిపయనములు సరిగ నాహారము లభింపమి ప్రయాణకష్టములు మొదలగునవి సుకుమారుడైనయాగాయకుని యారోగ్యమునకు భంగము గలిగించెను. నానాటి కతనిస్థితి బాగుపడుటకు మారు క్షీణించుటంజేసి గురువు యాత్ర కట్టిపెట్టి పంజాబుదేశమునకు బోవ నిశ్చయించెను. కాని యామండలముచేరుటకైన యవకాశము లేకయే మర్దనునిస్థితి పూర్తిగ జెడిపోయెను. కొన్నిదినములుమాత్రమే యతడు జీవింపగలుగు నని గురువునకు దోచెను. అందుచేతవా రతనిని దీర్ఘప్రయాణము సేయింపక దాపున నున్న యొకపల్లెకు దీసికొనిపోయి చేతనైనచికిత్స చేయించి స్వహస్తములతో జేయదగినంతయుపచారము జేసెను. బలుడును దనచెలికానికి శక్య మైనపరిచర్య గావించెను. ఆయుశ్శేషము లేనప్పుడు వైద్యములు నుపచారములు నిష్ప్రయోజనములు గదా. మర్దను డెట్టకేలకు మృతినొందెను. మర్దనుడు తనమరణానంతరమున తనదేహము దగ్ధము సేయవలసినదేకాని ఖననము చేయగూడ ద