పుట:Nanakucharitra021651mbp.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ట్టకేలకు దుర్గమమగునీపర్వతరాజముశరణు వేడి గుహాంతరములు నివాసములుగ జేసికొని సుఖించుచు వచ్చిరి. ఇట్టియామహాశైలముయొక్క నపారమహిమము పురాణములవలననేగాక చూచినతైర్థికులవలనగూడ విని దేశాటనపరాయణ డగునానకు శ్రవణంబుల వినిన దంతయు నేత్రంబులతో జూచి యానందింప దలచుట యాశ్చర్యము కాదు.

అత డాపర్వతమున కరిగి యొకక్షత్రమునుండి యొక క్షత్రమున కరుగుచు గంటి కగపడినబ్రహ్మవాదులతోడ వేదాంతచర్చలు సేయుచు దనప్రభావమెఱుగక తన్ను నిందించినవారిచేత నానావమానంబులం బడుచు భూషణంబులకు సంతసింపక దూషణంబులకు దురపిల్లక తనపనిచేసుకొనుచుండెను. మొట్టమొదట నతనియాసక్తిభావము కర్మకాండనిరసనము జూచి యాయామతస్థులు వానిని తమతమమతంబులంజేరు మనిపిలుచి యత డందు జేరక యామతముల ఖండింపవాంతనియెడల గౌరవము జూపకపోయిరి. కాని కాలక్రమమున నతనివి శేషవినయంబును సాటిలేనిసత్ప్రవర్తనమును సారము లేనిభక్తియు సూనృతవ్రతాశక్తియు గనుగొన్నపిదప నతడసాధారణపురుషు డనియు సర్వవిధముల మాననీయు డనియు దెలిసికొని యుధార్హగౌరవము గావించిరి. తొలుదొల్త నతనిని విశ్వసింపక యనుమానముతో జూచినవారు వానిసద్గుణసంపద యాలస్యముగ గనిపెట్టి యతడు తమ్ము విడిచిపోవున