పుట:Nanakucharitra021651mbp.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గావించి పారసీకగాంధారాదిదేశము లతిక్రమించి పాంచాలదేశము ప్రవేశించి యెట్ట కేలకుసుల్తానుపురముజొచ్చి చెలియలిగృహము జేరెను. అన్నయుం జెలియలు పరస్పరసందర్శన జనితానందమున బరవశత్వము నొందిగాడాలింగనము జేసికొనిరి. కొంతకాల మతడు సోదరీగృహంబున వసియించి పుణ్యభూములలో నగ్రగణ్య మైనహిమాలయపర్వతము జూడదలంచెను. తలపుపుట్టగానె యతడు బయలుదేఱెను.

హిమాలయము హిందూస్థానమునకుత్తరమున భగవంతుడు నిర్మించినస్పటికపుగోడయో యనునట్లు భాతతఖండలక్ష్మిశిరోభాగంబున దాల్చినవడ్రంపుమకుటమో యనునట్లు విరాజిల్లుచుండును. ఇది యనేకపుణ్యక్షేత్రములకు నిలయము. నరనారాయణులకు నివాస మైనబదరికాశ్రమ మిందేయున్నది. సిద్ధసాధ్యగంధర్వఖేచరాదుల కిది విహారస్థాన మనియు నుమామహేశ్వరులకునికిప ట్టనియు బ్రహ్మాదిసురగణంబునకు సిద్ధమునివర్గమునకు నీమహీధరకూటములు యజ్ఞవాటము లనియు గుమారస్వామికి జన్మభూమి యనియు భగీరధిప్రయత్నమున నాకాశంబుననుండి మహీతలంబునకు దిగినగంగాదేవికి వసతిస్థలం బనియు నెల్లయోషధులకు నిలయం బనియు బురాణములలో వర్ణింపబడినది. మఱియు బరమభాగవతోత్తమ లగుమహామహులు పరమతస్థులు తమ్ము బాధించినప్పుడు నిలువ నీడలేక తలదాచుకొనుటకు జోటు లేక యె