పుట:Nanakucharitra021651mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేత్రగోచారము లగును గాని సృష్టింపబడనివి. కంటి కగపడవు. భగవంతుడు సృష్టిపదార్థములలోనివాడు కాడు. కావున నతడు మానవదృగ్గోచరుడగుట యసంభవము. కాని జీవాత్మ చర్మోపాధిని బాసి పరిశుద్ధావస్థ జెందినప్పుడు పరమేశ్వరసాన్నిధ్యము బడయుటకు బాత్ర మగును. పవిత్ర మైన ఖురానుగ్రంథము భగవద్వాక్యము కాదు. కారణ మే మన భగవంతున కొకభాష లేదు.

అట్లు కొన్నిదినములు మదీనానగరమున నుండి యచ్చటివిశేషములు దర్శించుచుండ బ్రియసోదరింజూడ నతనికి బుద్ధిపుట్టెను. ఈచెలియలిమీద నాయనకు మొదటినుండియు నింతింత యనరానిప్రేముడి యుండెను. ఏలయన నీతోబుట్టువే చిన్ననా డతని కెన్నిసారులో శరణం బిచ్చెను. తంద్రి కఠిను డై యతని పై బిట్టలుక పూనినప్పుడు కాపాడెను. తన సోదరుడు మిక్కిలినీతిమంతు డనియు సత్యప్రియు డనియు నిక్కడక్కడ యనక యవకాశము వచ్చినచోటనెల్ల వాదించుచు వచ్చెను. లౌకికవ్యవహారవిముఖు డై పరమేశ్వరధ్యానపరాయణుడై సోదరుడు మందమతి యై యున్నపుడు తనభతన్‌సయితము పిచ్చివా డని యెగతాళిసేయుచుండ నామెయతడు పరమభాగవతోత్తము డని కనిపెట్టి గౌరవించెను. ఆకోరిక పొడమినతోడనే గురువు శిష్యసమేతుడై మదీనానగరమును విడిచి కొన్నిమాసములు నిరంతరప్రయాణములు